బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ లో ఈ మధ్య క్రష్ లు, కామెడీ చేసుకోవడాలు, డాన్స్ వేయడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రాజబర్దస్త్ చూస్తే గనక రాసిన స్కిట్ కంటే కూడా తమ మీద తామే జోక్స్ వేసుకుని ఆడియన్స్ ని నవ్వించే పనిగా పెట్టుకున్నారు కమెడియన్స్. కొన్ని సందర్భాల్లో అవి పేలుతున్నాయి కొన్ని సందర్భాల్లో తుస్సుమంటూ ఆరిపోతున్నాయి.
ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే పైన చెప్పిన విషయాలు అర్థమవుతాయి. వర్ష-ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ తో ఈ వారం స్కిట్ రాబోతోంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న జంటగా ఇందులో కనిపించారు. "శోభనానికి టైం అవుతుంది ఫ్లైట్ బుక్ చేయమన్నా చేశావా" అని ఇమ్ము అడగడం, వెరైటీ ప్లాన్ చేశా అది పడవలో అని వర్ష చెప్పుకున్నారు. బులెట్ భాస్కర్ వీళ్ళ పడవ నడిపేవాడిగా వచ్చాడు. నాటి నరేష్ లేడీ గెటప్ లా ఉందే అంటూ వర్ష మీద కౌంటర్ వేససరికి ఇమ్ము కోటింగ్ ఇచ్చాడు. ఇంతలో టీ, కాఫీలు అమ్ముకునే అతను వచ్చి వర్ష జంటకు టీ ఇచ్చాడు. అలా ఎలా సముద్రంలోంచి వచ్చి టీ ఇచ్చాడు అని అడిగేసరికి స్కెటింగ్ షూస్ కొనుక్కున్నాడు అని చెప్పాడు భాస్కర్. అందరూ స్టన్ ఇపోయారు.
ఇక స్కిట్ ఐపోయాక.. జడ్జి ఖుష్బూ లేచి వెళ్లి "ఎన్నో రాత్రులొస్తాయి గాని" సాంగ్ కి భాస్కర్ తో కలిసి డాన్స్ చేసింది. ఇంతలో మరో జడ్జి కృష్ణ భగవాన్ లైన్ లోకి వచ్చి "భాస్కర్ నీ లైఫ్ లో ఏదైనా సాధించావ్ అని ఎవరైనా అడిగితే..నేను ఖుష్బూ గారితో డాన్స్ వేసాను అని చెప్పొచ్చు" అన్నారు.